మంత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం వినతి

కామారెడ్డి జిల్లా , జూలై 25 ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహ కు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గురువారం ప్రతిపాదనలు పంపారు.దీనికి వైద్య శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజంపేట మండలం లోని కొండాపూర్ గ్రామములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కృషి చేస్తున్న మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలుపున్నట్లు రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి తెలిపారు.