రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి ,ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ఎన్ జయలత హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 12 మంది వైద్య బృందంతో కూడిన హాస్పిటల్ సిబ్బంది హాజరై రోగులను పరీక్షించారు. వీరితోపాటు క్యాన్సర్, స్క్రీనింగ్ సంబంధించి ప్రత్యేక బస్సు సైతం అందుబాటులో ఉంచారు. ఈ క్యాన్సర్ క్యాంపులో ముఖ్యమైన క్యాన్సర్లు ,గర్భాశయ,నోటి, రొమ్ము క్యాన్సర్ సంబందించిన పరీక్షలు 110 మందికి పరీక్షించి ఉచితంగా మందుల పంపిణి నిర్వహించారు. వారికి ఎక్స్ రే,లాంటి స్కాన్ టేస్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని ప్రత్యేకంగా జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్, రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి లు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం యన్ జె క్యాన్సర్ వైద్య నిపుణులు వైద్యులు సౌమ్య(రేడియో ఒంకాలోజిస్ట్ ), హరిశంకర్, నిలోఫర్(రేడియేలోజిస్ట్లు ), డిప్యూటీ డిఎంహెచ్వో, డాక్టర్ శిరీష,డాక్టర్ శోభా,అన్నారం పిహెచ్ సి వైద్యులు మానస, పాలిటివ్ టీం డా ఘన్ష్యామ్, ఆయుర్వేద వైద్యులు చైతన్య, హెల్త్ సూపర్ వైజర్ భీమ్, రంగు రవిందర్ గౌడ్, ఎంపీటీసీలు రజితరాజేందర్ గౌడ్, రాజేందర్, ఆరోగ్య సిబ్బంది ,ఎయన్ ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.