నూతన పట్టా పాస్ బుక్ పొందిన వారు రైతు భీమాదరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి జిల్లా , జూలై 26 ( లోకంతీరు ) : రాజంపేట మండలంలో నూతనంగా పట్టా పాసు బుక్కు వచ్చిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల ప్రజలకు మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి శుక్రవారం తెలియజేశారు. రైతు మరణిస్తే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం ప్రభుత్వం ద్వారా సంబంధిత నామినీకి ఇవ్వడం జరుగుతుందన్నారు.గ్రామంలో ఒక్క గుంట నుంచి ఎన్ని ఎకరాలు ఉన్న రైతు అయినా ప్రమాదవశాత్తు, ఏ ఇతర కారణాల వల్ల మరణించిన రైతు కుటుంబాలు ఆగం కావద్దని వారిని ఆర్థికంగా అదుకునే ఉద్దేశంతో వారి సంక్షేమం కోసం లబ్ధి చేకూరుస్తూన్న రైతు భీమా పథకాన్ని యధావిధిగా కొనసాగించడం హర్షణియమన్నారు. కావునా రైతులు భీమా దరఖాస్తు ఫారం నింపి దానితో పాటు నూతనంగా వచ్చిన పట్టా పాస్ బుక్, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని, ప్రతి ఒక్కరూ రైతు వేదిక భవనంలో రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు