బాల్కొండ లో ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు జిల్లా కలెక్టర్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 30 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజా పాలన లో పథకాలను ప్రతి ఒక్కరికి అందించేలా మండల అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరచాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మండల సంబంధిత అధికారులను మంగళవారం బాల్కొండ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మికంగా విచ్చేసి సందర్శించి పరిశీలించారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఎంతవరకు ఆన్లైన్ చేశారని, జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్వయంగా సంబంధిత రిజిస్టర్లను, కంప్యూటర్లను కూడ జిల్లా అదనపు కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. ప్రజా పాలనలో పథకాలు అమలు కాని వారికి, తెలియని వారికి సైతం తెలిసేలా గ్రామాల్లోని కార్యదర్శుల ద్వారా ప్రజా పాలన పథకాలు అందించేలా ప్రచారం చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజా పాలన పథకాల దరఖాస్తులను స్వీకరించడంలో, ఆన్లైన్లో దరఖాస్తులను ఆన్లైన్ చేయడంలో, విధుల పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు చేపడతామని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మండల పరిషత్ సంబంధిత అధికారులకు హెచ్చరిస్తూ ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల పనులను నీటి వసతిని పర్యవేక్షించారు బస్సాపూర్ గ్రామంలో సంపద వానలాలను చూసి పిచ్చి మొక్కలు పెరగకుండా చూడాలని సూచించారు జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ వెంట కె.విజయభాస్కర్ రెడ్డి ఎంపీడీవో , గంగా మోహన్ ఎంపీ ఓ , వినీత్ ఏ ఈ ఆర్ అండ్ బి , శివగంగాధర్ ఏపిఎం ,ధనుంజయ్ టి ఏ ,రవీందర్ టి ఏ మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి లు రజనీకాంత్ మరియు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు