Take a fresh look at your lifestyle.

వడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఆయకట్టు రైతుల వినతి…

0 1,446

వడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఆయకట్టు రైతుల వినతి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 30 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు రైతులు ఆయా కట్ట రైతులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది.అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగు నీటి కోసం తరలిస్తామని మున్సిపల్ అధికారులు ప్రకటించడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే తమ చెరువు 2000 ఎకరాలకు సాగునీరు అందించవలసిన చెరువు కూడిక నిండడం వల్ల చివరి ఆయకట్టుకు నీరందడం లేదని ఇంకా ఆ చెరువు నుండే 30% నీటిని కామారెడ్డి పట్టణానికి తరలిస్తామని ప్రకటిస్తే ఇక తమ బతుకులు రోడ్డున పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై జిల్లా యంత్రాంగం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ పెద్ద చెరువు కింద అడ్లూరు ఎల్లారెడ్డి అడ్లూరు, రంగంపేట్, పోసానిపేట్, గొల్లపల్లి, ఇస్రోజివాడి, కన్నాపూర్, రామారెడ్డి, గర్గుల్, గ్రామాల చిన్న సన్నకారు రైతులకు సాగునీరు అందించే ఈ చెరువు నీటిని కామారెడ్డికి తరలించొద్దని అదనపు కలెక్టర్ కు రైతులు కోరడం జరిగింది.

రైతుల పొట్ట కొట్టి దౌర్జన్యంగా నీటిని తరలిస్తామంటే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సింగిల్విండో చైర్మన్లు మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.