లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 01 (లోకంతీరు) : జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పనా రమేష్ తో కలిసి గురువారం పరిశీలించారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని, ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మేషన్ రోడ్డు వేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డు కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. నాలుగు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. బావి చుట్టూ నిర్మిస్తున్న రక్షణ కంచెను పరిశీలించారు. త్వరలోనే ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పునరుద్ధరించబడిన ఈ భావిని ప్రారంభించడం జరుగుతుందని పనులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో నరేష్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇఇ గిరి లను ఆదేశించారు.