Take a fresh look at your lifestyle.

పచ్చదనం లక్ష్యాలను సాధించుటకు గ్రామాలను భాగస్వాములు చేయాలి….

0 1,246

పచ్చదనం లక్ష్యాలను సాధించుటకు గ్రామాలను భాగస్వాములు చేయాలి

— జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (లోకంతీరు) : స్వచ్ఛదనం , పచ్చదనం కార్యక్రమ లక్ష్యాలను సాధించుటకు గ్రామాలు, పట్టణంలో ప్రజలను భాగస్వాములను చేయాలి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు.లక్ష్యాలను సాధించుటకు గ్రామాలు, పట్టణంలో ప్రజలను భాగస్వాములను చేయాలి.ఆగస్టు 5 వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాలు జిల్లాలో నిర్వహణపై శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఎంపివోలు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి ఈ నెల 9 వరకు స్వచ్ఛదనం,పచ్చదనం పేరిట పారిశుధ్యం, వైద్య సేవలు, మంచినీటి ట్యాంకులు క్లీనింగ్ చేయుట, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయుట, పచ్చదనం పెంపుకు మొక్కలు నాటడం, జ్వర నియంత్రణ చర్యలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీజన్ వ్యాధులు ప్రబలే కాలమని అందువల్ల పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టేందుకు ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని
తెలిపారు.స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాలు నిర్వహణకు గ్రామ, మున్సిపల్ వార్డుల స్థాయిలో టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.5వ తేదీన
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు, మహిళా సంఘాలు, యువత, ప్రముఖులతో కార్యక్రమం నిర్వహణ యొక్క ప్రాధాన్యతను తెలియచేయుటకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు.
గ్రామ, మున్సిపల్ స్థాయిలో ప్రతి ఇంటి నుండి వ్యర్దాలు సేకరించుట,అట్టి వ్యర్దాలతో వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, సీజనల్ వ్యాధులపై విద్యార్థులులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని అన్నారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రదేశాలను శుభ్రపరచాలని స్పష్టం చేశారు.
చెత్త సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం అమర్చాలని తెలిపారు.మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి మరుగుదొడ్లు మంజూరు చేయాలని అన్నారు.6వ తేది రెండోరోజుతాగునీటి ట్యాంకులు శుభ్రపరచుట,క్లోరినేషన్ నిర్వహించేలా చైతన్యపరచాలని,క్లోరినేషన్ కిట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. మంచినీటి. పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ఇంకుడు గుంతలు లేని ఇళ్లను గుర్తించి, ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.తాగునీటి చెరువులు, కుంటలు కలుషితం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
7వ తేదిన మురుగుకాల్వలు పూడిక తీయుట, వర్షపు, మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ల్లోకి మళ్లించాలన్నారు.లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని,రోడ్లపై
గుంతలను మట్టితో పూడ్చి రోలింగ్ చేయాలన్నారు.
తాగునీటి చేతిపంపులు, మురుగుకాల్వల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
8వ తేది నాలుగో రోజు
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాదులు డెంగీ, మలేరియా, డయేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించాలని, జ్వరంతో బాధపడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్, గంభూషియా చేపలు వేయాలన్నారు.
మున్సిపల్ పరిధిలో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ వినియోగంలోకి తేవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వీధి కుక్కలు సంచరించే ప్రాంతాలను గుర్తించి యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో కు.ని శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్, పశు సంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో ఏబీసీ కేంద్రాలకు తరలించాలన్నారు.
9వ తేదీన చివరి రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలు.శుక్రవారం డ్రై డేలుగా పాటించుటపై అవగాహన కల్పించాలని అన్నారు.పంచాయతి, మున్సిపల్ వార్డుల్లో
శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి తొలగించాలన్నారు.ఈ ఐదు రోజులలో ఎప్పుడైనా వనమోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్ల పక్కన ఎండిపోయిన చెట్లను తొలగించి అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి మొక్కలు నాటాలని, కమ్యూనిటీ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్,…

Leave A Reply

Your email address will not be published.