గంగమ్మ వాగు కు మరమ్మత్తులు ప్రారంభమై రాకపోకలు

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 2 (లోకంతీరు) : రామారెడ్డి గంగమ్మ వాగు దగ్గర రోడ్డు మరమ్మత్తులు శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత ఇరిగేషన్ డీఈ జాలిగాం శ్రీనివాస్ , పోలీస్ సిబ్బంది.గ్రామపంచాయతీ సెక్రటరీ క్రాంతి కుమార్ ట్రాక్టర్ లతో మొరం పోయించడం జరిగింది. ఇక ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని బ్రిడ్జి పనులు పూర్తి అయ్యే అంతవరకు ప్రజలకు ఇబ్బంది కాకుండా బ్రిడ్జి నిర్మాణ పనులను అతి తొందరగా పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తొందర్లోనే ఒక 20 రోజుల వ్యవధిలో లోపల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని కాంట్రాక్టర్,ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ అన్నారు.