సీజనల్ సమస్యల పరిష్కారానికే స్వచ్చదనం పచ్చదనం..
– జిల్లా DRDA అధికారి సాయ గౌడ్




కమ్మర్ పల్లి, ఆగస్ట్ 03 ( లోకంతీరు ) : సీజనల్ వ్యాధుల పరిష్కారం తోపాటు స్థానికంగా పచ్చదనం మరియు పరిశుభ్రతను పెంపొందించే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి చేపట్టబోతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ పేర్కొన్నారు.
శనివారం కమ్మర్పల్లి రైతు వేదికలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 9 వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టబోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రోజువారి కార్యక్రమాల వివరాలను వివరించారు.
తొలి రోజు గ్రామ సభ నిర్వహించి ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా వివరించాలని అనంతరం ర్యాలీ నిర్వహించాలని అన్నారు. అనంతరం శ్రమదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.