Take a fresh look at your lifestyle.

మిషన్ భగీరథ పైప్ లీకేజి పట్టించుకొని అధికారులు…

0 1,296

మిషన్ భగీరథ పైప్ లీకేజి పట్టించుకొని అధికారులు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  ఆగస్టు 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామములో మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా అయ్యే లైను గత 20 రోజుల నుండి లీకేజీ అవుతుంది కానీ గ్రామ పంచాయితీ అధికారులు ఇ లికేజును చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు, ఈ విషయమై మండల అధికారులకు ఈ లీకేజీ విషయము తెలిపిన కానీ ఫలితం లేకపోయింది, గ్రామంలో మిషన్ భగీరథ మంచినీరు లైను లీకేజ్ ఉన్నందున నీరు కలుషితమై ప్రజలు అనారోగ్య బారిన పడకుండా లీకేజీ మరమ్మత్తులు చేయించాలని ప్రజలు అన్నారు, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు ఈ విషయమై పై జిల్లా అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.

Leave A Reply

Your email address will not be published.