నిజామాబాద్ జిజిహెచ్ లో తెలంగాణ జాతిపిత,
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ శ్రీ కొత్తపల్లి జయశంకర్ సర్ గారి జయంతి వేడుకలు…..

నిజామాబాద్, ఆగస్టు 06 ( లోకంతీరు ) : చిరస్మరణీయులు ప్రొఫెసర్ శ్రీ కొత్తపల్లి జయశంకర్ 91 వ జయంతి పురస్కరించుకొని జిజిహెచ్ నిజామాబాదులో ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన డాక్టర్ ప్రతిమారాజ్ సూపరింటెండెంట్ మరియు ఆసుపత్రి సిబ్బంది.ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన మహానుభావుడు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం తొలుతడుగులేసి, తన జీవిత చరమాంకము వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ మలిదశలో ఉద్యమంలో ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచిన ఆదర్శమూర్తి అయినా వారి 91 వ జయంతి ని జి జి హెచ్ లో ఈ రోజు జరిపినట్లు తెలిపారు మరియు ఆయన చేసిన కృషికి నేడు మనం స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామని, తెలంగాణ యావత్తు ఎల్లప్పుడూ ఆ మహానుభావుని స్మరించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. వి వి రావు, డిప్యూటీ సూపరింటెండెంట్, డా.బాలరాజ్, డా.కమ్రన్,వైద్య విభాగాధిపతులు, పద్మ,సాయిలు ఆఫీసు సూపరింటెండెంట్, చంద్రకళ నర్సింగ్ గ్రేడ్ I,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.