Take a fresh look at your lifestyle.

లక్షా 50 వేల లోపల రుణం ప్రతి రైతుకు రుణ మాఫీ కాలేదు…

0 1,455

లక్షా 50 వేల లోపల రుణం ప్రతి రైతుకు రుణ మాఫీ కాలేదు

– ఇస్రోజివాడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 08 ( లోకంతీరు ) : ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. సాంకేతిక కారణాల సాకుతో ఇతర సమస్యల్ని చూపించి చాల మంది రైతులకు రుణ మాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అర్హులైన రైతులకు అందరికీ 2లక్షల వరకు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో రచ్చ బండ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రుణమాఫీ కానీ రైతుల నుండి వివరాలు తీసుకొని సంతకాల సేకరణ చేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా లక్షా 50 వేల లోపల రుణం ఉన్న ప్రతి రైతుకు రుణ మాఫీ కాలేదనీ, అధికారులు గ్రామాల్లోకి వస్తే ఆ విషయం అర్థం అవుతోందన్నారు. రుణ మాఫీ కానీ రైతులు బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన 8886100097 కి పోన్ చేసి వివరాలు చెప్తే వారి సమస్య పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రుణమాఫీ అర్హులైన ప్రతి రైతుకు అయ్యేవరకు బీజేపీ అండగా ఉంటుందనీ అన్నారు. బిజేపి జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ఆగస్ట్15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణ మాఫీ చేయాలనీ డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాల సాకుతో ఇతర సమస్యల్ని చూపించి చాల మంది రైతులకు రుణ మాఫీ కాలేదనీ ఇలాంటి రైతుల సమస్యలు అధికారులు దృష్టిలో ఉంచుకొని రుణమాఫీ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, బిజెపి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.