Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారి…

0 1,221

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారి

కామారెడ్డి జిల్లా,అగస్టు 20 (లోకంతీరు): జిల్లాలోని సదాశివ నగర్ మండలం భూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో సంతోష్ కుమార్ మరియు ప్రత్యేక అధికారితో కలిసి మధ్యాహ్న భోజనం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెను ప్రకారం అందించాలని మధ్యాహ్న భోజనంలో అవకతవకలు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ ను కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు డబ్బులు రావడం లేదని ఎంపీడీవో సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం డబ్బులు వచ్చే విధంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం ఎలా వండుతున్నారని, రుచిగా ఉంటుందో లేదో అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రుచిగానే వండుతున్నారని మెను ప్రకారం వంట వండుతున్నారని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఏపీవో మధు, ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.