Take a fresh look at your lifestyle.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

0 1,212

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా /రాజంపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన లకావర్ మల్లేష్ తండ్రి దీప్ సింగ్, వయసు 27, కులం ఎస్టీ వృత్తి వ్యవసాయం భార్య భర్తల గొడవలో పురుగుల మందు సోమవారం తగినాడు. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో మరణించారు. భార్యా భర్తల కలహాల వల్ల కుటుంబ సమస్యలతో గొడవపడి మనస్థాపానికి గురై పురుగుల మందు త్రాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇట్టి విషయంపై రాజంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.