రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎంపిక

కామారెడ్డి ప్రతినిధి/,రామారెడ్డి,ఆగస్టు 29 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలోని రెడ్డి పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎన్నికయ్యారు. వచ్చేనెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగే ఏడవ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి ఎన్నికలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డిపేట్ కు చెందిన 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి,ఫిజికల్ డైరెక్టర్ సాయి మౌర్య, తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, సీనియర్ క్రీడాకారులు గ్రామస్తులు ఘనంగా అభినందించారు.