Take a fresh look at your lifestyle.

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు – ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు…

0 1,313

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు – ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 30 ( లోకంతీరు ) : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది.నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్‌ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి.వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.డెంగీ,చికెన్‌ గున్యా,టైఫాయిడ్‌ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది.నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ మండలం లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పుమంటున్నాయి.అప్పుడప్పుడూ వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి. మలేరియా, డయేరియాతో పాటు డెంగీ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి.నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చే రోగులసంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్‌ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు.

పారిశుద్ధ్య లోపం… పొంచి ఉన్న అనారోగ్యం…

వర్షాకాలం ప్రారంభమైంది పారిశుద్ధ్య లోపం తో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. బాల్కొండ మండలం లోని ఆయా గ్రామాలలో పారిశుద్ధ్య లోపంతో అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దోమల వ్యాప్తి పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు.
చర్యలు శూన్యం వర్షాలు పడడంతో దోమలు విజృంభిస్తున్నాయి.పల్లెల్లో పరిశుభ్రతత పై అధికారులు దృష్టి పెట్టకపోవడం తో అనారోగ్యం భారిన పడాల్సివస్తుంది. జిల్లా వ్యాప్తంగా మలేరియా,డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న యంత్రాంగం లో కదలిక లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాల ప్రాంతాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ ను చల్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటకెక్కిన ఫాగింగ్ ప్రక్రియ

గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. ఖాళీ స్థలాలు, రోడ్లపై మురుగు నీరు చేరి నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి.
పంచాయితిల్లోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది.

పెరుగుతున్న డెంగీ కేసులు:- ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం వందల కొద్ది ఓపీ నమోదవుతోంది.అందులో ఎక్కువ భాగం వైరల్‌ జ్వరాలే ఉంటున్నాయి.అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.వర్షాలతో డయేరియా రోగులు పెరుగుతుండగా ఈగలు, దోమల కారణంగా మిగతా వ్యాధుల వ్యాప్తి జరుగుతోంది. బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.