Take a fresh look at your lifestyle.

అధికారుల పోరాటానికి బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం.

0 20

అధికారుల పోరాటానికి బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం.
న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: ముస్కె సమ్మయ్య.
శ్రీరాంపూర్, జూలై 3 (ప్రజాలక్ష్యం ప్రతినిధి): మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారుల సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సింగరేణి బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ సంఘీభావం ప్రకటించింది. శుక్రవారం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ కార్యక్రమంలో నాయకులు పాల్గొని అధికారుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకుడు ముస్కె సమ్మయ్య మాట్లాడుతూ, అధికారుల సంఘం ముందుంచిన న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో అధికారుల సంఘం చేపట్టే ఉద్యమాలకు కూడా బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు, అధికారుల న్యాయమైన హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షుడు బారుపాటి మారుతి, బ్రాంచ్ కార్యదర్శి బద్రి బుచ్చయ్య, సహాయ కార్యదర్శి చంద్రమోహన్, లక్కాకుల మహేష్, రఘురామ్, కోటయ్య, కొత్తపెళ్లి రవీందర్, జగదీష్, కొమరయ్య, ఫిట్ సెక్రటరీ మహేష్, ఆర్కే-7 ఫిట్ సెక్రటరీ పవన్, సత్యనారాయణతో పాటు బీసీ, ఓబీసీ అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.