కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ఆగష్టు 31 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ లు స్థానిక శాసన సభ్యులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, వార్డ్ మెంబర్లు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.