Take a fresh look at your lifestyle.

ప్లేట్లెట్స్ అందజేత….

0 1,240

ప్లేట్లెట్స్ అందజేత

— జిల్లా రక్తదాతల సేవాసమితి

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరం తో చికిత్స పొందుతున్న సాయి (23) అనే పేషంట్ కి ఓ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో పేషంట్ కుటుంబ
సభ్యులు.కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో స్పందించిన లింగాపూర్ వాసి రమేష్ రెడ్డి ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ రమేష్ రెడ్డి తను లింగాపూర్ గ్రామస్థులతో బ్లడ్ ఇప్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇలాగే యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది.ఈ సందర్బంగా ప్లేట్లెట్స్ దానం చేసిన రమేష్ రెడ్డి కి జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పేషంట్ కుటుంబసభ్యులు,కే బి ఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.