మత్స శాఖ చైర్మన్ ను వినతి పత్రం అందించిన జిల్లా గంగపుత్రులు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ను కలిసి కామారెడ్డి జిల్లా మత్స పారిశ్రామిక సంఘం నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అందులో గంగపుత్రుల సమస్యలైనటువంటి మెంబర్ షిప్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ మరియు చేప పిల్లల విత్తనాల పంపిణీకై ఈ పత్రంలో కోరారు. అందుకు రాష్ట్ర చైర్మన్ స్పందించి ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి మత్స్యకారులందరికీ సహకారం అందిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా సంఘ అధ్యక్షులు అందరితో రాష్ట్ర రాజధాని రవీంద్ర భారతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులతో సమావేశము ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గంగపుత్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి సమావేశంలో కామారెడ్డి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గాదం సత్యనారాయణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.