వర్షాలకు నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
– పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా /భిక్కనూర్ , సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : జిల్లాలోని భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీరు చేరిన బాధితులను మంగళవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరామర్శించి ఆర్థిక సాయం చేసి, వారికి భరోసా ఇచ్చారు.
గత కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి కక్కుర్తి పడి చెరువుల్లో ఎఫ్ టి ఎల్ భూముల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు కట్టించి వారి ప్రాణాలతో చెలగాట మాడారు.
వేలకోట్లతో ఫామ్ హౌస్ లు కట్టుకొని ప్రజలను మాత్రం నీటిలో ఉండేలా ఇండ్లు కట్టించారన్నారు.
నాణ్యత లేని ఇండ్లు కట్టి, కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే రామేశ్వరపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూం లు ప్రమాదకరంగా ఉన్నాయని మీడియా సాక్షిగా చెప్పానన్నారు.
ఈ రోజు డబుల్ బెడ్ రూమ్ లలో ఉన్నవారికి ప్రాణాల పైకి వచ్చిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పునరావాసం కల్పించాం త్వరలో వారికి అధికారులతో మాట్లాడి వేరే స్థలాల్లో వారికి ఇల్లు కేటాయిస్తామన్నారు.
ఇల్లు నీట మునిగిన వారికి తన సొంతగా ఆర్థిక సహాయం, పండ్లు అందించారు. వారికి బట్టలు, అన్నం అందిస్తామన్నారు.
ప్రకృతి విపత్తు జరిగిన సమయంలో పార్టీలకతీతంగా ప్రజల్లో ఉండాలి. కానీ ఒకరేమో ఫామ్ హౌస్ లో ఉండి ఇంకొకరు విదేశాల్లో ఉండి విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల నుండి ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ.. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతి నాయకుడు తమ తమ నియోజక వర్గాల్లో తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో తిరుగుతూ వారికి ఆదుకుని, వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా నాయకులు చంద్రకాంత్ రెడ్డి, మండల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.