మెరిట్ విద్యార్థినీలకు నగదు ప్రోత్సాహం అందజేత

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : ముప్కాల్ కస్తూరిబా గాంధీ పాఠశాల పదవ తరగతి విద్యార్థినీలకు మంగళవారం జిల్లా సెక్రెటరీ న్యాయ సేవ అధికారిణి పద్మావతి నగదు ప్రోత్సాహం అందజేశారు. గతంలో పాఠశాలలో క్యాంపు నిర్వహించిన సమయంలో పదవ తరగతి ఫలితాల్లో మంచి గ్రేడ్ సాధించిన మెరిట్ విద్యార్థినీలకు నగదు ప్రోత్సాహాన్ని ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు ముగ్గురు విద్యార్థినీలకు వెయ్యి చొప్పున ఆర్మూర్ కోర్టు ఆవరణలో అందజేశారు. చదువులో రాణించినప్పుడే గుర్తింపు లభిస్తుందని విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు తగిన విధంగా ముందుకెళ్లాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి,ఎడియం కోర్టు సూపరిండెంట్ రమేష్,బిఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.