Take a fresh look at your lifestyle.

స్కూల్ బస్సుల ఫిట్నెస్ అవగాహన సదస్సు….

0 1,237

స్కూల్ బస్సుల ఫిట్నెస్ అవగాహన సదస్సు

– జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి 

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) :  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయా ప్రయివేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ అవగాహన సదస్సును పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ ఆదేశాల మేరకు పాఠశాల బస్సు యాజమాన్యాలకు, పాఠశాలల ప్రిన్సిపాల్ లకు పాఠశాలల బస్సుల మెయింటెనెన్సు గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో పాఠశాల బస్సులను తరచూ తనిఖీ చేసుకొని ఎప్పటికప్పుడు తగిన మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ పాఠశాలల యాజమాన్యం, పాఠశాలల ప్రిన్సిపల్స్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్టీసీ మెకానిక్స్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.