Take a fresh look at your lifestyle.

డీసీ గారు మా మోర ఆలకించండి…..

0 1,363

డీసీ గారు మా మోర ఆలకించండి

– మూడో డిపో పై సమగ్ర విచారణకు ఆదేశించండి

– స్థానికేతర్లు లను తొలగించి నిజామాబాద్ లో స్థానిక నివాసం

– ఉంటున్న వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఎక్సైజ్ డిప్యూటీ

– కమిషనర్ కు ఫిర్యాదు చేసిన గౌడ యువజన సంఘం     నాయకులు


నిజామాబాద్ ,ఆగస్టు 06 ( లోకంతీరు ) : నగరంలోని మూడవ కల్లు డిపో కు చెందిన భవాని గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులుగా నల్గొండ జిల్లా ఆదిలాబాద్ జిల్లా మరియు భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలకు సిరికొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన స్థానికేతర్లను తొలగించి వారి స్థానంలో నిజాంబాద్ నగరానికి చెందినటువంటి నిజమైన గీతా కార్మికులకు అవకాశం కల్పించాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెండవ సొసైటీ లో సభ్యత్వం లభించని వారితో 12 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి మూడవ కళ్ళు సొసైటీ లో నిజమైన గీతా కార్మికులకు స్థానికులకు అవకాశం కల్పించకుండా వేరే ప్రాంతాల వారిని తన బంధు వర్గాన్ని సభ్యులతో నింపడం జరిగిందని వారిని తొలగించాలని నిజాంబాద్ లోకల్ వారికి అవకాశం కల్పించాలని కోరారు 2020 సంవత్సరంలో అప్పటి ఎక్సైజ్ సూపరిండెంట్ మరియు డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ సమక్షంలో జరిగిన సమావేశంలో నూతనంగా కార్మికులకు అవకాశం కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఒక్క నూతన కార్మికుడికి అవకాశం కల్పించిన పాపాన పోలేదని ఈ సొసైటీని ఒక కుటుంబం తన సొంతంలా భావిస్తుందని అన్నారు అడిగిన సభ్యులను ప్రశ్నించిన కార్మికులను నోటీసులు ఇచ్చి బయటకు పంపి చేస్తున్న సంఘటనలు చాలా జరిగాయి ఈ సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని స్థానికంగా ఉంటున్నటువంటి నిజమైన గీతా కార్మికులకు మాత్రమే అవకాశం కల్పించి ఎక్సైజ్ శాఖ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సిరిగాధ స్వామి గౌడ్ రాజగోపాల్ గౌడ్ అఖిల్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.