స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిని

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సత్తా చాటిన పేరం అక్షిత 68 వ స్కూల్ గేమ్స్ ఫేఢరేషన్ ఇంటర్ స్కూల్ హైదరాబాద్ జిల్లా స్థాయి ఎయిర్ పిస్తోల్ టెన్ మీటర్స్ టోర్నమెంట్, సెలక్షన్ 2024-2025 లో అండర్ 17 సంవత్సరాల బాలికల ఎయిర్ పిస్తోల్ విభాగం లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పేరం అక్షిత తండ్రి పేరం స్వామి కామారెడ్డి వాస్తవ్యులు అబ్సిగూడ లో శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న పేరం అక్షిత గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానం లో నిలిచింది. అక్షిత తన గెలుపుకు సహకరించిన తన వ్యక్తిగత కోచ్ నిరంజన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆదివారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫ్ తెలంగాణ ఆద్వర్యంలో నాంపల్లి లోని మదీనా పబ్లిక్ స్కూల్ లో ఈనెల 21 నుండి 23 తేదీ వరకు జరిగిన రైఫీల్ షూటింగ్ పోటీలు,సెలక్షన్ లో గెలుపొందిన విజేతలకు హైదరాబాద్ రైఫీల్ షూటింగ్ ఫిజికల్ డైరెక్టర్ జోసెఫ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత షూటింగ్ విభాగం లో ఆసక్తి కనబరచాలని తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఇందుకు కోచ్ తోపాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో ఫిసికల్ డైరెక్టర్లు , విజయ్ శేఖర్ ,అనితరెడ్డి వెంకటలక్ష్మి,కోచ్ లు అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.