డిప్యూటీ సీఎం ను కలిసిన ఎమ్మెల్యే
— మదన్ మోహన్ రావు

కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 4 ( లోకంతీరు ) : హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిశారు. ఈ సందర్భంగా, ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పెండింగ్ బిల్స్‌ను త్వరగా విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ని కోరుతూ వినతి పత్రం అందచేయడం జరిగింది.అంతేకాక, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే లింగంపేట్ మండలంలోని మోతే గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సిద్ధం చేశామని తెలిపారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాలకు సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.