అఖిల భారత ఐఎన్‌టీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణకు కీలక బాధ్యతలు.
సింగరేణి కార్మిక నాయకులకు కేంద్ర కమిటీలో కీలక పదవులు.
కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, ఐరేణి ఉదయ్ కుమార్ సహాయ కార్యదర్శిగా నియామకం.
నూతన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ ప్రసాద్ సాహూను అభినందించిన తెలంగాణ ప్రతినిధులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, మే 31:
అఖిల భారత జాతీయ కార్మిక సంఘం (ఐఎన్‌టీయూసీ) జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో శనివారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వర్కింగ్ కమిటీ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్మికుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇటీవల ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఎంపీ డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిర్వహించిన వర్కింగ్ కమిటీ సమావేశం కావడం విశేషం. దివంగత మాజీ ఎంపీ చంద్రశేఖర్ దూబే స్థానంలో ధీరజ్ ప్రసాద్ సాహూ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్.జి. అరుణ్ కొనసాగుతున్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఈపీ ఆపరేటర్స్ అండ్ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డిని అఖిల భారత కోల్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్‌లో ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అదే విధంగా ఐరేణి ఉదయ్ కుమార్ను సహాయ కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ, ప్రధాన కార్యదర్శి ఎన్.జి. అరుణ్ సమక్షంలో ప్రకటించడం జరిగింది. సింగరేణి ప్రాంత కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో సమర్థవంతంగా ప్రస్తావిస్తూ కార్మిక హక్కుల పరిరక్షణకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ ప్రసాద్ సాహూను తెలంగాణ ప్రతినిధులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం, కార్మిక సంఘాల బలోపేతం వంటి అంశాల్లో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్‌ల ప్రభావం, వాటివల్ల కార్మికులకు కలుగుతున్న నష్టాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై పడుతున్న ప్రభావం, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలు, సంస్థాగత వ్యవహారాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీలో సింగరేణి ప్రాంత నాయకులకు కీలక బాధ్యతలు దక్కడంపై తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టీయూసీ నాయకులు, సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకాలతో సింగరేణి కార్మికుల సమస్యలు జాతీయ స్థాయిలో మరింత బలంగా వినిపించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అఖిల భారత కోల్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరగడం కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం మరింత సమన్వయంతో పనిచేస్తామని నూతనంగా నియమితులైన నాయకులు తెలిపారు. అఖిల భారత ఐఎన్‌టీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణకు కీలక బాధ్యతలు.
సింగరేణి కార్మిక నాయకులకు కేంద్ర కమిటీలో కీలక పదవులు.
కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, ఐరేణి ఉదయ్ కుమార్ సహాయ కార్యదర్శిగా నియామకం.
నూతన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ ప్రసాద్ సాహూను అభినందించిన తెలంగాణ ప్రతినిధులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, మే 31:
అఖిల భారత జాతీయ కార్మిక సంఘం (ఐఎన్‌టీయూసీ) జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో శనివారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వర్కింగ్ కమిటీ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్మికుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇటీవల ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఎంపీ డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిర్వహించిన వర్కింగ్ కమిటీ సమావేశం కావడం విశేషం. దివంగత మాజీ ఎంపీ చంద్రశేఖర్ దూబే స్థానంలో ధీరజ్ ప్రసాద్ సాహూ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్.జి. అరుణ్ కొనసాగుతున్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఈపీ ఆపరేటర్స్ అండ్ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డిని అఖిల భారత కోల్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్‌లో ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అదే విధంగా ఐరేణి ఉదయ్ కుమార్ను సహాయ కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ, ప్రధాన కార్యదర్శి ఎన్.జి. అరుణ్ సమక్షంలో ప్రకటించడం జరిగింది. సింగరేణి ప్రాంత కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో సమర్థవంతంగా ప్రస్తావిస్తూ కార్మిక హక్కుల పరిరక్షణకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ ప్రసాద్ సాహూను తెలంగాణ ప్రతినిధులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం, కార్మిక సంఘాల బలోపేతం వంటి అంశాల్లో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్‌ల ప్రభావం, వాటివల్ల కార్మికులకు కలుగుతున్న నష్టాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై పడుతున్న ప్రభావం, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలు, సంస్థాగత వ్యవహారాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీలో సింగరేణి ప్రాంత నాయకులకు కీలక బాధ్యతలు దక్కడంపై తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టీయూసీ నాయకులు, సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకాలతో సింగరేణి కార్మికుల సమస్యలు జాతీయ స్థాయిలో మరింత బలంగా వినిపించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అఖిల భారత కోల్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరగడం కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం మరింత సమన్వయంతో పనిచేస్తామని నూతనంగా నియమితులైన నాయకులు తెలిపారు.అఖిల భారత ఐఎన్‌టీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణకు కీలక బాధ్యతలు.
సింగరేణి కార్మిక నాయకులకు కేంద్ర కమిటీలో కీలక పదవులు.
కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, ఐరేణి ఉదయ్ కుమార్ సహాయ కార్యదర్శిగా నియామకం.
నూతన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ ప్రసాద్ సాహూను అభినందించిన తెలంగాణ ప్రతినిధులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, మే 31:
అఖిల భారత జాతీయ కార్మిక సంఘం (ఐఎన్‌టీయూసీ) జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో శనివారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వర్కింగ్ కమిటీ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్మికుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇటీవల ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఎంపీ డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిర్వహించిన వర్కింగ్ కమిటీ సమావేశం కావడం విశేషం. దివంగత మాజీ ఎంపీ చంద్రశేఖర్ దూబే స్థానంలో ధీరజ్ ప్రసాద్ సాహూ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్.జి. అరుణ్ కొనసాగుతున్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఈపీ ఆపరేటర్స్ అండ్ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డిని అఖిల భారత కోల్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్‌లో ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అదే విధంగా ఐరేణి ఉదయ్ కుమార్ను సహాయ కార్యదర్శిగా నియమిస్తూ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ, ప్రధాన కార్యదర్శి ఎన్.జి. అరుణ్ సమక్షంలో ప్రకటించడం జరిగింది. సింగరేణి ప్రాంత కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో సమర్థవంతంగా ప్రస్తావిస్తూ కార్మిక హక్కుల పరిరక్షణకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జాతీయ అధ్యక్షుడు ధీరజ్ ప్రసాద్ సాహూను తెలంగాణ ప్రతినిధులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం, కార్మిక సంఘాల బలోపేతం వంటి అంశాల్లో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్‌ల ప్రభావం, వాటివల్ల కార్మికులకు కలుగుతున్న నష్టాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై పడుతున్న ప్రభావం, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలు, సంస్థాగత వ్యవహారాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీలో సింగరేణి ప్రాంత నాయకులకు కీలక బాధ్యతలు దక్కడంపై తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టీయూసీ నాయకులు, సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకాలతో సింగరేణి కార్మికుల సమస్యలు జాతీయ స్థాయిలో మరింత బలంగా వినిపించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అఖిల భారత కోల్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరగడం కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం మరింత సమన్వయంతో పనిచేస్తామని నూతనంగా నియమితులైన నాయకులు తెలిపారు. “అఖిల భారత ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ నాయకత్వంలో ఇంత పెద్ద స్థాయిలో జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం అభినందనీయమని, తెలంగాణ సింగరేణి కార్మికుల తరఫున వారికి ప్రణామాలు తెలియజేస్తున్నామని” సింగరేణి ఈపీ ఆపరేటర్స్ అండ్ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
“సభలో మాట్లాడిన కట్కూరి శ్రీనివాస్ రెడ్డి”:
రాంచీలో జరిగిన సమావేశంలో కట్కూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్న ఐఎన్‌టీయూసీ స్ఫూర్తితో తెలంగాణలో కూడా భారీ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని, ఆ కార్యక్రమానికి డాక్టర్ ధీరజ్ ప్రసాద్ సాహూ ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతున్నామని” తెలిపారు. “భారతదేశంలో అత్యంత కీలకమైన బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి ఒకటని, దేశ విద్యుత్ రంగానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి విశేష పాత్ర పోషిస్తోందని” అన్నారు. పరిపాలనా పరంగా సింగరేణి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ, ఉద్యోగుల వేతన బోర్డు, వేతన ఒప్పందాలు, కార్మిక సంక్షేమ విధానాలు దేశంలోని ఇతర బొగ్గు గనుల కార్మికులతో సమానంగా అమలవుతాయని వివరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించిన జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.