బయ్యారంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.
ఓటర్ల జాబితా ప్రక్షాళన పారదర్శకంగా జరగాలి: సర్పంచ్ ఇనుగాల లింగయ్య.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, జూలై 8:కాటారం మండలంలోని బయ్యారం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను బుధవారం స్థానిక సర్పంచ్ ఇనుగాల లింగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇనుగాల లింగయ్య మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేపట్టాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఈ పరిశీలనలో సూపర్వైజర్ సతీష్, బీఎల్ఏ జాగిరి రాజబాబు గౌడ్, వార్డు సభ్యుడు మహేష్, బీఎల్ఓ స్వప్న, రెవెన్యూ సిబ్బంది పసుల భానుప్రసాద్తో పాటు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.