Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల కోసం గుడిసెవాసుల క్షేత్రస్థాయి సర్వే : ఎంపీడీవో బాబు

0 3

ఇందిరమ్మ ఇళ్ల కోసం గుడిసెవాసుల క్షేత్రస్థాయి సర్వే : ఎంపీడీవో బాబు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా పారదర్శకంగా ప్రక్రియ.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

కాటారం, జూలై 24:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన అర్హులకు అందేలా మండలంలోని గుడిసెవాసుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నట్లు కాటారం ఎంపీడీవో ఎ.బాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని ప్రతాపగిరి, అంకుషాపూర్ గ్రామపంచాయతీల్లో ఆయన స్వయంగా పర్యటించి గుడిసెవాసుల పరిస్థితిని పరిశీలిస్తూ సర్వే నిర్వహించారు. కుటుంబాల నివాస పరిస్థితులు, అర్హతలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాబు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తుగా గుడిసెవాసుల సర్వే చేపడుతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా పారదర్శకంగా, నిష్పాక్షికంగా సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. అర్హత ఉన్న లబ్ధిదారులు అవసరమైన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఊర వెంకటేశ్వరరావు, సోదారి కల్పన, ప్రతాపగిరి గ్రామపంచాయతీ కార్యదర్శి అరికిల్లి శంకరయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.