
భువనగిరిలో ఘనంగా గరుడ వస్త్ర సిల్క్స్ షోరూమ్ ప్రారంభం.
కుటుంబ సమేతంగా షాపింగ్‌కు సరికొత్త వేదిక..
ముఖ్య అతిధిగా పాల్గొన్న సినీ నటి మీనాక్షి చౌదరి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 21:భువనగిరి పట్టణంలో గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. భువనగిరి మెయిన్ రోడ్డులోని కాలేజ్ గ్రౌండ్ పక్కన ఏర్పాటు చేసిన గరుడ వస్త్ర సిల్క్స్–ఫ్యామిలీ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఫ్యాషన్ ప్రియులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జక్కా రఘునందన్ రెడ్డి, అనంత్ రెడ్డి, జక్కా శ్యామంతకమణి, జక్కా మానీషా, జక్కా శ్రేయ ఆధ్వర్యంలో షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయ, ఆధునిక దుస్తులతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిరుచులకు అనుగుణంగా విభిన్నమైన ఫ్యాషన్ కలెక్షన్లను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపింది.
గరుడుడి స్ఫూర్తితో…
హిందూ పురాణాల్లోని గరుడుడి కథ నుంచి బ్రాండ్ తత్వానికి స్ఫూర్తి పొందినట్లు యాజమాన్యం పేర్కొంది. అమృతం కోసం గరుడుడు చేసిన పోరాటం, ఆయనకు ప్రతీకలుగా భావించే బలం, భక్తి, కరుణ, నిస్వార్థ ప్రేమ వంటి విలువలను తమ సంస్థలోనూ ప్రతిబింబించేలా ముందుకు సాగుతున్నట్లు వివరించింది. కుటుంబాల్లో ప్రేమ, ఐక్యత, అనుబంధాలను మరింత బలోపేతం చేసే విలువలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది.
అన్ని వర్గాల వారికి విస్తృత కలెక్షన్లు:
షోరూమ్‌లో వివిధ సందర్భాలకు అనుగుణంగా చీరలు, సంప్రదాయ దుస్తులు, ఆధునిక వస్త్రాలు, కుటుంబ సభ్యుల కోసం విభిన్న ఫ్యాషన్ కలెక్షన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నాణ్యత, అందం, వైవిధ్యం, తాజా ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఒకే వేదికపై అందించేలా షోరూమ్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గరుడ వస్త్ర సిల్క్స్‌కు చెందిన జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి, పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి నూతన షోరూమ్‌ను సందర్శించి ప్రత్యేక కలెక్షన్లతో పాటు ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ డా. కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీనివాణి, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, జిల్లా లైబ్రరీ చైర్మన్ అవలిస్ ఉర్ రహ్మాన్ చిష్టీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ, కౌన్సిలర్లు నకోటి నాగేష్, జలిగం విఘ్నేష్, PACS చైర్మన్ పకీరు కొండల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన లాంచ్ ప్రమోషన్లను అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. భువనగిరి ప్రజలకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసేందుకు నూతన అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది.