భూపాలపల్లి ఏరియాలో ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలు.
అన్ని గనులు, విభాగాల్లో జెండాలు ఆవిష్కరించిన నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 31: ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమరయ్య భవన్‌లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల రమేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. భూపాలపల్లి ఏరియాలోని అన్ని బొగ్గు గనులు, వివిధ విభాగాల్లోనూ ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేటీకే 1 ఇంక్లైన్‌లో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి జి. శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి సదయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేటీకే ఓసీ-2లో ఫిట్ కార్యదర్శి కరిముల్లా జెండా ఆవిష్కరించారు. కేటీకే 5 ఇంక్లైన్‌లో బ్రాంచ్ కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ పాషా, ఫిట్ కార్యదర్శి వి. రాజేందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేటీకే 6లో ఫిట్ కార్యదర్శి పి. శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. క్వాలిటీ విభాగంలో ధార పోషయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అదేవిధంగా వర్క్‌షాప్, ఏరియా ఆస్పత్రిలో ఏఐటీయూసీ బ్రాంచ్ కమిటీ నాయకుడు తాళ్ల పోశం, ఫిట్ కార్యదర్శులు ఎన్. రమేష్, డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎస్ అండ్ పీసీలో సాంబయ్య ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జి. సుధాకర్ రెడ్డి, సీపీఐ నాయకులు కుడుదుల వెంకటేష్, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, పొన్నగంటి లావణ్య, భీమనాథుని సత్యనారాయణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.