Take a fresh look at your lifestyle.

మృతుడి కుటుంబానికి అండగా వెంకట్రావుపల్లి గ్రామస్తులు.

0 1

మృతుడి కుటుంబానికి అండగా వెంకట్రావుపల్లి గ్రామస్తులు.
రూ.1,27,620 ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ అందజేత.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
టేకుమట్ల, అక్టోబర్ 31: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కసరవెన కుమార్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా గ్రామస్తులంతా కలిసి ‘మన గ్రామం’ వాట్సాప్ గ్రూపు ద్వారా రూ.1,27,620 విరాళాలను సేకరించారు. సేకరించిన మొత్తాన్ని మృతుడి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు భరోసాగా ఉండేలా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అందుకు సంబంధించిన బాండ్‌ను గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన గ్రామస్తుల ఐక్యత, మానవత్వంపై పలువురు ప్రశంసలు కురిపించారు. మృతుడి కుటుంబానికి గ్రామమంతా తోడుగా నిలవడం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.