Take a fresh look at your lifestyle.

గుండు వెంకట్‌కు ‘భారత్ కళా పురస్కార్–2026’.

0 3

గుండు వెంకట్‌కు ‘భారత్ కళా పురస్కార్–2026’.
బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పురస్కారం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 3: ఫోటోగ్రఫీ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ వివాహ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ముఖ్య సందర్భాలను తన కెమెరాలో అద్భుతంగా చిత్రీకరిస్తున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుండు వెంకట్‌కు ప్రతిష్టాత్మక ‘భారత్ కళా పురస్కార్–2026’ లభించింది. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విభాగంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక అవార్డు కార్యక్రమంలో నిర్వాహకులు గుండు వెంకట్‌ను ఘనంగా సత్కరించి అవార్డును అందజేశారు. ఫోటోగ్రఫీ రంగంలో ఆయన అందిస్తున్న సేవలు, ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొంతకాలంగా ఫోటోగ్రఫీ రంగంలో తనదైన శైలితో గుర్తింపు పొందుతున్న గుండు వెంకట్.. వివాహ వేడుకల్లోని అపురూపమైన క్షణాలను అత్యుత్తమ నాణ్యతతో చిత్రీకరిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఫోటోగ్రఫీలో నూతన ఒరవడిని తీసుకువస్తున్నారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా గుండు వెంకట్ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి ‘భారత్ కళా పురస్కార్–2026’ అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఫోటోగ్రఫీ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గుండు వెంకట్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించడంపై కుటుంబ సభ్యులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.