దేవి నవరాత్రుల ఉత్సవాలకు భూమి పూజ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : జిల్లాలోని తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం గ్రామంలోని యువకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ రాబోయే దేవి నవ రాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన సంఘం నాయకులు నరేష్, రేవంత్, రాజమల్లు, రాకేష్, వంశీ, సతీష్, శివకుమార్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.