
బోట్ల సదానందం కుమారుడి వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సింగరేణి కార్మిక సంఘాల నేతలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
వరంగల్, అక్టోబర్ 17: వరంగల్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోట్ల సదానందం రెండో కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వరంగల్ నగరపాలక సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మానవతా రాయ్తోపాటు పలువురు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరంగల్ గొర్రెకుంట లోని పిడిఆర్ ఫంక్షన్ హాలులో ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో పాల్గొన్న నాయకులు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, నూతన దంపతులకు తమ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.వి. రావు, ఐఎన్టీయూసీ మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గడిపె చక్రపాణి, బ్రాంచి కార్యదర్శి మండల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం రాజమల్లు హాజరయ్యారు. అలాగే ఐఎన్టీయూసీ నాయకులు, కేటీకే-1 ఇంక్లైన్ మైన్ ఇన్చార్జిలు ఉయ్యాల హుస్సేన్, పి. శ్రీధర్, బీఎంఎస్ బ్రాంచి నాయకుడు రాసకట్ల నర్సింగరావు, మందమర్రి గ్రౌండ్ ఇన్చార్జి నస్పూర్ తిరుపతి తదితరులు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల హాజరుతో వివాహ వేడుక సందడిగా సాగింది. బోట్ల సదానందం కుటుంబ సభ్యులు అతిథులకు స్వాగతం పలికి, వారి రాక పట్ల కృతజ్ఞతలు తెలిపారు.