Take a fresh look at your lifestyle.

వేడుకగా కోటగిరి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల వీడ్కోలు సభ.

0 1,722

వేడుకగా కోటగిరి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల వీడ్కోలు సభ.

  • ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ప్రజలకు చేసిన పనులు ఎప్పటికీ నిలిచిపోతాయి..సర్పంచ్ పత్తి లక్ష్మణ్.

 

బాన్సువాడ/కోటగిరి, జనవరి 30 ( లోకం తీరు ) : ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేసిన పనులు ఎప్పటికీ చరిత్ర లో నిలిచి పోతాయని కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు.మంగళవారం కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాల యంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అధ్యక్షత న సర్పంచ్,ఉప సర్పంచ్ అలా గే పంచాయతీ పాలక వర్గ స భ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తయి నందున గ్రామ పంచాయతీ సిబ్బంది,ఆయ శాఖల అధికారులు వారిరివురిని సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యు లు విజయవంతంగా ఐదు సంవత్సరాల పాటు గ్రామ అభివృద్ధికి విశేషమైన సేవలు చేశార ని కొనియాడారు.గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అధ్యక్షత న పాలక వర్గ సభ్యులు చేసిన సేవలను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎమ్మార్వో మాట్లాడుతూ. సర్పంచ్,ఉప సర్పంచ్,పాలక వర్గ సభ్యులు గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచుతూ,రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచడం గొప్ప విషయమని అన్నారు.అదే విధంగా పారిశుద్ధ్య విషయంలో వారు గ్రామాలలో రోడ్లను వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేశారని అన్నారు.15 ఫైనాన్స్,స్టేట్ ఫండ్స్,ఎస్డి ఎఫ్ ఫండ్స్,వివిధ రకాల గ్రాండ్స్ ద్వారా కోటగిరి గ్రామంలో 400 డబుల్ బెడ్రూంలు,విశాలమైన స్మశాన వాటికలు,చెత్త సేకరణ, గ్రామానికి ప్రత్యేక నిధులు తేవడం,గ్రామానికి అవసరాలైన పలు మౌలిక వస్తువుల కల్పన, పలు కులసంఘాల భవనాలు, సిసి రోడ్లు,డ్రైనేజీలు,ఇంటిం టికి త్రాగు నీరు వంటి భృహత్తర కార్యక్రమాలు చేసిన ఘనత సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అలాగే కోటగిరి గ్రామ పంచాయతీ పాలక వర్గనిదే అని అన్నారు.

1358గ్రామ పాలక వర్గం సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అలాగే అంగన్వాడీ,ఆశవర్కర్స్ సిబ్బంది యొక్క సహకారం వెలకట్టలేనిది వారందరికీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. వీడుకోలు సమావేశ సభకు ముందు సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మహాత్మా గాంధీ వర్ధంతినీ పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆవరణంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా స్మరించుకున్నారు.అనంతరం జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా వీడ్కోలు సభలో ప్రభుత్వం పంపిన కుష్టు నివారణ కై ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో ప్రభాకర్, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్,కోటగిరి సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు,ఎంపీటీసీ కరీమాభి సలీం,కోటగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శి ముజఫర్ బేగ్,ప్రజాప్రతిని ధులు,మండల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.