విద్యార్థులకు అవగాహన కల్పించాలి….

భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : పట్టణంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యూ మండల కన్వీనర్ ఎం. నరసింహ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిడ్నాపర్స్ బడి బయటి పిల్లలను, బడి పిల్లలను ఎత్తుకెళ్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ప్రతి ఒక్క పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు తగు సూచనలు చెప్పాలని అన్నారు. కిడ్నాపర్స్ ఎన్నో మారు వేషాల్లో వస్తున్నారన్నారు. చిన్న చిన్న పిల్లలు చాకొలేట్ కు ఆశ పడి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్లే అవకాశాలు ఎక్కువ కాబట్టి పదే పదే చిన్న పిల్లలకు చెప్తూ ఉండాలని అన్నారు.అదే విధంగా పిల్లలను వారి యొక్క తల్లిదండ్రులు వస్తేనే బయటికి పంపాలని అన్నారు.స్కూల్ టైం లో విద్యార్థులు బయటకు వెళ్ళకూడదని, బయటకు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఏదైనా జరిగితే స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి కిడ్నాప్ లు జరగకుండా విద్యార్థులకు అవేరేనెస్ ఇస్తూ ఉండాలని అన్నారు. అదే విధంగా విద్యార్థులకు ఎవరైనా సైగలు చేసిన, చాకొలేట్ ఇస్తామని, కూల్ డ్రింక్స్ ఇస్తామని, ఐస్క్రీమ్ లు ఇస్తామని పిలిస్తే విద్యార్థులు వెళ్ళకూడదని విద్యార్థులను కోరారు.పట్టణం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తప్పకుండ అప్రమత్తంగా ఉండాలని పి డి ఎస్ యూ గా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో కార్తీక్, మణి, కృష్ణ, మహేందర్ పాల్గొన్నారు.