బాల్కొండ మండల పరిధి గ్రామాల్లో స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 06 ( లోకంతీరు ) :బాల్కొండ మండల పరిధిలో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయ భాస్కర్ రెడ్డి ఎంపీడీఓ బాల్కొండ , ఇత్వార్ పేట్, జలాల్ పూర్ , నాగపూర్ మరియు బస్సాపూర్ గ్రామాలను సందర్శించి తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాలలో గ్రామస్థాయి అధికారులతో మరియు పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛదనం పచ్చదనంపై కార్యక్రమం నిర్వహించారు గ్రామాలలో స్వచ్ఛత పైన మహిళా సంఘాలకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడమైనది.పచ్చదనంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో రోడ్ల వెంబడి మొక్కలు నటించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతి అధికారి గంగా మోహన్, డిప్యూటి తహసిల్దార్ వినోద్ , ఉపాది హామీ ఎపిఓ ఇందిరా, ధనుంజయ్ టీ ఏ మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.