Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం…లోకం తీరు విశ్లేషణ…

0 1,569

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కు విశ్లేషణ..!

  • లోకం తీరు విశ్లేషణ…!

కామారెడ్డి రామారెడ్డి, ఫిబ్రవరి 13 ( లోకంతీరు )యావత్ భారతదేశం మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల దినోత్సవం అని ఎంతో సంబరాలు జరుపుకునే ప్రేమ జంటలకు వినూత్నంగా వారి సాంప్రదాయబద్ధంగా జరుపుకునే దినోత్సవాన్ని పురస్కరించుకొ

టెడ్డీ డే…!

టెడ్డీబేర్‌ని ఇష్టపడని  వారెవరుంటారు. ఎవరైనా సరే టెడ్డీ బేర్‌ని చూడగానే మనసు పులకించిపోతుంది. అందుకే తనిని ఎంతో ప్రేమించే వారికి టెడ్డీ బేర్‌ని గిఫ్ట్‌గా ఇస్తారు. ఈ గిఫ్ట్‌ చాలాకాలం వరకూ గుర్తుండిపోతుంది. ఆ మధురక్షణాల్ని జ్ఞప్తికి తెస్తుంది.

ప్రామిస్‌ డే…!

ప్రేమికులు తమ ప్రేమను నిలుపుకునేందుకు.. జీవితాంతం ఆ ప్రేమని కాపాడుకునేందుకు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు. ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండేందుకు ఇరువురూ జీవితాంతం శ్రద్ధ వహించాలి. ఎంతో బాధ్యతతో మెలగాలి. జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా.. ఇద్దరు ఎదుర్కొని ముందుకు సాగాలనే లక్ష్యంతోనే వాగ్దానం చేసుకుంటారు. బహుమతులు కొన్నిరోజులకి మాయమైపోవచ్చు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అంటే మాములు విషయం కాదు. అందుకే ఈ డేకి ఎంతో స్పెషల్‌.

హగ్‌ డే…!

భావాలను మాటలతో చెప్పలేనప్పుడు స్పర్శతో వాటిని వ్యక్తపరచవచ్చు. చాలా సందర్భాలలో భావాలను వ్యక్తపరచడానికి మాటలు రావు. అది బాధైనా, సంతోషమైనా ఏదైనా సరే. ఆ సమయంలో హగ్‌ చేసుకుంటే.. వారికి ఇట్టే తెలిసిపోతుంది. బాధలో ఉన్నప్పుడు హగ్‌ చేసుకుంటే.. ఎదుటివారు ఓదార్పునిస్తారు. సంతోషంలో అయితే ఆ హ్యాపీనెస్‌ని వాళ్లు షేర్‌ చేసుకుంటారు. కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్‌ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది. ఒకరి ప్రేమ మరొకరికి వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు ఇదొక చక్కటి మార్గం.

కిస్‌ డే..!

ముద్దు ప్రేమికుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ప్రేమికులు తాము ప్రేమలో ఉన్నామని బయటకు చెప్పడానికే.. నలుగురికి తెలియజేయడానికే కిస్‌ చేసుకుంటారు. కిస్‌ ప్రేమ యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది.

చివరగా ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే జరుపుకుంటారు. వారం రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో స్పెషల్‌. ఈ వారం రోజుల మధురానుభూతుల సమ్మేళనమే వాలంటైన్స్‌ డే.

Leave A Reply

Your email address will not be published.