Take a fresh look at your lifestyle.

ఘనంగా మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు……

0 1,379

ఘనంగా మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) : తెలంగాణ ఉద్యమనేత, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, శాసన సభ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుక లను ఉమ్మడి కోటగిరి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం వేడుకగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోతంగల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు అలాగే కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో బీఆర్‌ఎస్‌ నేతలు,ప్రజా ప్రతినిధులు కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి తెచ్చి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా తొమ్మిదినర ఏండ్లుగా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు రోడ్డున పడ్డ ఆటో కార్మికులకు ఆదుకో వాలని ఉద్దేశంతో కెసిఆర్ వెయ్యి మంది కార్మికులకు లక్ష రూపాయల చొప్పున ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ శనివారం నాడు టిఆర్ఎస్ భవన్ లో ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.దేవుని ఆశీస్సులతో కేసీఆర్ ఎల్లప్పుడూ నిండు నూరేండ్లు ఆరోగ్యాంగా ఊండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఏజాజ్ ఖాన్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,ఉమ్మడి మండల ఎంపిటిసిలు,తాజా మాజీ సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,ఆయా గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు,బీఆర్ఎస్ పార్టీ యువజన,విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, కెసిఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.