రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి
– మాజి జడ్పిటిసి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 22( లోకంతీరు ) : రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర జడ్పిటిసిల పోరం ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతు రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్న డబ్బులు ఏవని ప్రశ్నించారు. రైతుబంధు కోసం 70లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలతో పాటు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ చేయడంలో విఫలం కావడంతో, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరిట రైతులకు లేని ఆంక్షలు కొర్రీలు పెట్టి కేవలం 40 నుంచి 60 శాతం మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి బూటకపు హామీలు ఇచ్చారని, రైతులకు రైతు బంధు కింద 15,000 ఇస్తామన్న పథకం పత్తా లేకుండా పోయిందని, కౌలు రైతులకు 12 వేలు ఊసే లేదని, కళ్యాణలక్ష్మి చెక్కు తో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా తుంగల తొక్కారని, మహిళలకు 2,500 పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదని, ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కల్పన లేదని.. 6 గ్యారంటీలకే దిక్కు మొక్కు లేదని… కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు, ఏకకాలంలో రెండు లక్షలు రుణం పొందిన రైతులకు రుణ మాఫీ చేయాలని కోరారు రుణ విముక్తులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బంధు వెంటనే వేయాలని కోరారు.