రోడ్ విస్తీర్ణలో భూములు కోల్పోతున్న రైతులకు మద్దత్తుగా ఆందోళన చేస్తున్న ఉద్యమనేతల అరెస్ట్…..ఎస్ఐ దిష్టి బొమ్మ దగ్ధం
మాస్ లైన్ నేతల అరెస్ట్…భీంగల్ ఉద్రిక్తం…
పోలీస్ స్టేషన్ ముందు భీంగల్ ఎస్ఐ
హరిబాబు దిష్టి బొమ్మ దగ్ధం
- ఉద్యమ నేతలపట్ల దురుసుగా ప్రవర్తించిన భీంగల్ SI హరిబాబును సస్పెండ్ చేయాలి
- మోర్తాడ్ లో రోడ్ విస్తీర్ణలో భూములు కోల్పోతున్న రైతులకు మద్దత్తుగా ఆందోళన చేస్తున్న ఉద్యమనేతల అరెస్ట్ లను ఖండించండి.
- CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ డిమాండ్


భీంగల్ ప్రతినిధి, మార్చ్ 13 ( లోకంతీరు ) : మోర్తాడ్ లో రోడ్ విస్తీర్ణలో భూములు కోల్పోతున్న రైతులకు మద్దత్తుగా ఆందోళన చేస్తున్న ఉద్యమ నేతలను అరెస్ట్ చేసిన సందర్బంగా ఉద్యమ నేతలపట్ల దురుసుగా ప్రవర్తించిన భీంగల్, ముప్కాల్ SI లను సస్పెండ్ చేయాలి అని CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నాడు మోర్తాడ్ లో అరెస్ట్ చేసిన CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు V. ప్రభాకర్ తో పాటు 10మంది నాయకుల అరెస్ట్ లతో పాటు దురుసుగా ప్రవర్తించిన భీంగల్ SI హరిబాబు దిష్టిబొమ్మను పోలీస్ స్టేషన్ ముంద దగ్ధం చేశారు.
ఈ సందర్బంగా (ఎం ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ మాట్లాడుతు: రోడ్ విస్తీర్ణంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన మోర్తాడ్ లో ఆందోళన చేస్తున్న మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు V. ప్రభాకర్ అన్నతో పాటు మాస్ లైన్ ప్రజాసంఘాల నేతలు 10మందిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. అరెస్ట్ చేసిన వారిని అప్రజాస్వామికంగా, దురుసుగా ప్రవర్తించి భీంగల్ కు తరలించారని, భీంగల్ లో కూడా అరెస్ట్ అయినా నాయకులను పార్టీ, ప్రజాసంఘాల నేతలు కలవనీయకుండా నియంతృత్వంగా ప్రవర్తించడాన్ని దారుణం అన్నారు. పోలీస్ లు కూడా నియాంతాల చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం శోచనీయం అన్నారు. రైతుల పక్షాన ఆందోళన చేయడం ఎం నేరం అని, ఆందోళన కారులను అడ్డుకోవడం ఏ రాజ్యాంగం లో ఉంది అని అయన ప్రశ్నించారు. భీంగల్ SI హరిబాబు అతి ఉత్సాహం తో సర్కార్ కు తోత్తుగా మారి ప్రజాఉద్యమాల పట్ల నియంతృత్వంగా వ్యవహరించడం సరి అయినది కాదు అన్నారు. ప్రభుత్వం ఒకవైపు రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటుంటే ఇక్కడ భీంగల్ SI మాత్రం సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అవేవకం అన్నారు. నియంతృత్వం తో జులము ప్రదర్శించిన SI హరిబాబును వెంటనే సస్పెండ్ చేయాలి అని అయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి R. రమేష్, నాయకులు R. దామోదర్,B.బాబన్న, K. రాజేశ్వర్,G. నడ్పినర్సన్న , D. సాయిరెడ్డి, PYL జిల్లా అధ్యక్షులు MD.అనీస్, సిరికొండ, భీంగల్ మండల నాయకులు E. రమేష్, B. సర్పంచ్ సాయిలు,G. అరవింద్, M.శ్రవణ్,M. మోహన్, CH. రాజేశ్వర్, P. సతీష్ తదితరులు పాల్గొన్నారు.