బెహరన్ తెలుగు కళా సమితి చొరవతో….
-
వారం రోజుల్లోనే స్వగ్రామం చేరిన మృతదేహం
మృతదేహం తెప్పించడానికి కృషి చేసిన కోటపాటి నర్సింహా నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

భీంగల్ ప్రతినిధి, మార్చి13 ( లోకంతీరు ) : బడా భీంగల్ గ్రామానికి చెందిన లొక్కిడి రాఘవేంద్ర(20) బెహరన్ దేశం కు బతుకుదెరువు కోసం వెళ్లి ఈనెల 6వ తేదీన గుండెపోటుతో మృతి చెందినాడు కుటుంబ సభ్యులు ఆర్మూర్ కు వెళ్లి “ ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక “ అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును సంప్రదించి తమ కొడుకు మృతదేహాన్ని త్వరగా ఇంటికి చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన కోటపాటి బెహరాన్ లో తెలుగు కళా సమితి సంక్షేమ కన్వీనర్ నోముల మురళికి వివరాలు పంపి ఎప్పటికప్పుడు సంప్రదించడంతో నోముల మురళి ఇండియన్ ఎంబసీ అధికారుల చుట్టూ తిరగడం వలన కేవలం వారం రోజుల్లోనే బాడీ ఇంటికి చేరింది
NRI CELL తెలంగాణ ప్రభుత్వ అధికారి చిట్టిబాబు సహకారంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బడా భీంగల్ వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయించారు . ఈ సందర్భంగా తెలుగు కళా సమితి సంక్షేమ కన్వీనర్ నోముల మురళికి , రాఘవేంద్ర పని చేసిన కంపెనీకి మరియు బెహరన్ లో ఇండియన్ ఎంబసీ అధికారులకు NRI CELL అధికారి చిట్టి బాబుకు కోటపాటి ధన్యవాదాలు తెలిపారు.