బోదేపల్లి గ్రామం లో సమయపాలన పాటించని కార్యదర్శి, కారోబార్
-
చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి

బాల్కొండ, జులై 06 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న కరొబార్ విధులకు వెళ్లకుండా అతను సత్య యూట్యూబ్ లో న్యూస్ కవర్ చేయడం జరుగుతుంది, కరొబార్ రిపోర్టర్ గా పని చేయవచ్చ, రిపోర్టర్ గా న్యూస్ కవర్ చేయడానికి వెళ్తే మరి గ్రామపంచాయతీలో కరొబార్ పని ఎవరు చేయాలి, కరొబార్ గ్రామ పంచాయతీ లో ఉదయం ఉండకుండా న్యూస్ కవర్ చేయడని కి వెళ్లడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రామపంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా అతని ఇష్ట రాజ్యాం చేస్తున్నాడు సమయపాలన పాటించకుండా అతనికి ఇష్టం వచ్చినట్లు వచ్చి వెళ్లడం జరుగుతుంది, ఇట్టి విషయము ఒక రిపోర్టర్ పంచాయతీ కార్యదర్శిని అడగగా అది ఆయన ఇష్టం ఎప్పుడన్నా రావచ్చు ఏదైనా చేసుకోవచ్చు నాకు అవసరం లేదు అతను ఏ పని చేసినా చేయకున్నా నాకు ఎలాంటి అవసరం లేదు అని తెలుపడం జరిగింది ,ఏదైనా ఉంటే పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అని తెలుపడం జరిగింది. రిపోర్టర్లు నన్ను ఏమి అడగకూడదు అని హెచ్చరించడం జరిగింది, మరి గ్రామపంచాయతీలో ఎవరుంటారు ఏ విషయమైనా తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి అనేది ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది ,కాని బోదెపల్లి గ్రామపంచాయతీలో జరుగు తున్న పనులు వింతగా అనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ లేని విధంగా ఇష్ట రాజ్యాంగ నడిపిస్తున్నారు, సమయపాలన పాటించడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు గ్రామంలో పరిశుభ్రత ఇష్ట రాజ్యాంగ పాటిస్తున్నారు, పై అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి మరియు కరొబార్ పై చర్యలు తీసుకోవాలని కోరు తున్నారు,
వివరణ : ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇట్టి విషయము తెలుసుకొని వారి పైన చర్యలు తీసుకుంటానని ఇలాంటివి గత కొన్ని రోజుల క్రితం కరొబార్, పంచాయతీ కార్యదర్శి ల పై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు, కరొబార్ పని చేయాలి లేకపోతే విలేకర్ పని ఏదో ఒకటి చేయాలి అని తెలిపారు, కరొబార్ విలేకరి పని చేయరాదు అని తెలిపారు. వీరి పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని బోదేపల్లి గ్రామ ప్రత్యేక అధికారికి కూడా తెలుపడం జరిగిందని తెలిపారు.