ఇసుక తరలింపుతో
ప్రశాంతతకు భంగం…?
. రైతుల పొలాలలో ఇసుక కోసం అనుమతి..?
. వ్యవసాయ శాఖ అధికారుల బిత్తర పోయే విధంగా తవ్వకాలు..?
. గ్రామాలలో ప్రశాంతత లేకుండా పోయింది..?
. ఇసుక బకాసురులు పుణ్యమా..?
. అనుమతులు లేకుండా త్రవ్వకాలు, జీరో దందా ..?
. అడ్డుకున్న భాజపా నాయకులు…?
. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ స్పందిస్తారా…! వేచి చూడాల్సింది

కామారెడ్డి జిల్లా, జూలై 07 ( లోకంతీరు ) : కలిసొచ్చింది కాలం అన్నట్లుగా ఇసుక బకాసుర్లు తమ అక్రమ దందా కోసం గ్రామాలలో అనుమతులు ఒకచోట త్రవ్వకలు మరొకచోట చేస్తూ గ్రామాలలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. కొంతమంది ఇసుక బకాసురు లు అధికారుల అండదండలు, పాలకుల సహకారంతో రైతుల భూమిలో ఇసుక మేటలు వేసినవి తొలగిస్తామని అనుమతులు తీసుకొచ్చి, అక్కడ ఇసుక లేకపోవడంతో దర్జాగా మంజీరా నదిలో ఇసుక త్రవ్వకలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి వే బిల్లులు లేకుండా బీర్కూర్, అస్కుల్ ఇసుక క్వారీలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బీర్కూర్ 2, మూడవ నెంబర్లు ఇసుక త్రవ్వకలు జరపాల్సి ఉండగా ఈ ప్రాంతంలో ఇసుక లేకపోవడంతో మంజీరా నదిలో ఎక్కడ కనిపించినా ఇసుక అక్కడి నుంచి తవ్వకాలు జరుపుతూ
ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జీరో దందా కొనసాగిస్తూ కోట్లు దండుకుంటున్నారు. దీనికి అడ్డం వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది ఇలా ఉండగా బిచ్కుంద మండలం అస్గుల్ ఇసుక త్రవ్వకాల కోసం ఇద్దరు రైతుల భూములు మంజీరా నదిలో మునిగిపోయి ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగిస్తామని అనుమతులు పొంది, రైతులు ఎంతో కొంత డబ్బులు ఇసుక మాఫియా నుంచి అందుకుని ఇసుక త్రవ్వకలకు అనుమతులు ఇచ్చారు . వాస్తవానికి రైతు పట్టా భూమిలో ఇసుక లేకపోవడంతో, మంజీరా నదిలో ఇసుక త్రవ్వకాలు జరపడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక త్రవ్వకాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి రావలసిన రాయల్టీ ఎగ కొట్టడానికి వే బిల్లులు లేకుండా, జీరో దందా సాగిస్తున్నట్లు తెలుసుకున్న బిచ్కుంద భాజపా నాయకులు అక్కడికి చేరుకుని, పరిశీలించగా ఏ ఒక్క లారీకి వే బిల్లులు లేకపోవడంతో బిజెపి మండల నాయకులు విష్ణు రెవిన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెవెన్యూ అధికారులు ఐదు లారీలను వే బిల్లులు లేకుండా వెళ్తున్నట్లు గుర్తించారు. ఐదు లారీలను బిచ్కుంద పోలీసులకు అప్పగించారు. రెండు నెలల నుంచి అస్కుల్, బీర్కూర్ మంజీరా నదిలో ఇసుక బకాసురులు చొరబడి సంబంధిత అధికారులు గుప్పెట్లో పెట్టుకొని, కొంతమంది పాలకుల సహకారంతో అక్రమ ఇసుక దందా కు తెర లేపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఇసుక క్వారీ నిర్వాకులపై మండిపడ్డట్టు తెలుస్తుంది. తక్షణం అస్గుల్, బీర్కూర్ ఇసుక క్వారీలను నిలిపివేయ లంటూ జిల్లా కలెక్టర్
ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం మంజీరా నదిలో ఇసుక క్వారీలు శుక్రవారం మూతపడ్డాయి. తదుపరి ఆదివారం సెలవు దినం సందర్భంగా పునర్ ప్రారంభించారు.. ఈ దోపిడీని అరికట్టే అధికారులు లేరా అని ప్రజలు భావిస్తున్నారు.