ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది
-
గాయల పాలైన వ్యక్తిపై దాడికి యత్నం
-
ఆస్పత్రి పై వైద్య సిబ్బంది చర్యలు తీసుకునేనా..?
-
![]()
కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : నేటి సమాజంలో సమస్యల కు అనుగుణంగా డాక్టర్ అంటే దేవుడితో సమానమని భావించే ఈ సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి చోటుచేసుకు వైద్యో నారాయణ అంటారు పెద్దలు, అలాంటి నానుడి ఈరోజుల్లో డబ్బులుంటేనే చికిత్స, లేదంటే ప్రాణాలు వదిలేసింది. అలాంటి ఘటన కామారెడ్డి జిల్లాలో వింత గటన చోటుచేసుకుంది. శీను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో హాస్పిటల్ చేరిన క్షతగాత్రునికి చికిత్స చేసిన పిదప సిబ్బంది ఫీజు చెల్లించలేదని కుట్లు విప్పేసిన వైనం కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శ్రీను అని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలం ఆసుపత్రిలో చేరి 300/- కన్సల్టెంట్ ఫీజ్ చెల్లించి తదుపరి వైద్య సిబ్బంది. డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసిన తదుపరి డబ్బులు డబ్బులు చెల్లించాలని, లేనిది హాస్పిటల్ నుండి వెళ్ళనివ్వబోమని వైద్య సిబ్బంది అడ్డుకున్నారని సమాచారం. శతకాత్రుడు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు పే చేసుకోండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వేసిన కుట్లను తొలగించిన వైనం కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై జిల్లా ఉన్నత వైద్య సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇలాంటి ఆసుపత్రి పై చర్యలు ఉన్నట్టా లేనట్టా? ముఖ్యంగా ఈ యొక్క ఆస్పత్రి యజమాని అండ్ డాక్టర్, ఓ జిల్లా ప్రభుత్వ ఉన్నత వైద్యాధికారి కొడుకు అని సమాచారం విశ్వసనియ సమాచారం. క్రెడిట్ కార్డు తో బిల్ చెల్లించడం పై దవాఖాన సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితో పాటు వెంట ఉన్న స్నేహితుల పై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి వేసిన కుట్లను విప్పేసి పంపించారు.
