Take a fresh look at your lifestyle.

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా…..

0 1,313

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా…..

– ఆరోపణలు ఉన్న ఆధికారే విచారణ చేయడం పై పత్ర విమర్శలు

– వారం రోజుల్లో నివేదిక అందజేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశం

 – ముందుకు సాగని వైనం 

– రోజు గంటల తరబడి ఎస్ హెచ్ ఓ ఆఫీసులో డిపో వేస్తున్న డిపో యజమానులు

– ఆడియో టేపులు లో ప్రమోటర్ చెప్పిన మాటల ప్రకారం ఎస్హెచ్ఓ చల్లబడ్డారా

నిజామాబాద్, ఆగస్టు 29 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని మూడవ కళ్ళు సొసైటీ పై వస్తున్న ఆరోపణలు విచారణ జరపాలని ఎక్సైజ్ సూపర్డెంట్ నాయక్ నిజామాబాద్ నగర ఎస్ హెచ్ ఓ కు విచారణ అధికారిగా నియమించడం జరిగింది గత రెండు నెలల నుండి గత రెండు నెలల నుండి భవాని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం త్రి నిజామాబాద్ సొసైటీలో సభ్యులుగా స్థానికేతరులు కొనసాగుతున్నారని వీరంతా అక్రమ ఆధార్ కార్డులను తప్పుడు చిరునామాలతో తప్పుడు నేటివిటీ సర్టిఫికెట్లను చూపించి స్థానికులమని సభ్యత్వం పొందడంపై గౌడ యువజన సంఘం మరియు మూడవ డిపోకు చెందిన కొంతమంది గౌడ కులస్తులు జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో రెండుసార్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేయడంతో నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వారం రోజుల్లో మూడవ కళ్ళు సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై తప్పుడు ధృవీకరణ పత్రలతో సభ్యత్వం పొందిన సభ్యులపై సమగ్ర విచారణ జరపాలని గడువును విధించినప్పటికీ ఈ విచారణ ఏ మాత్రం ముందుకు సాగడం లేదు ఈ డిపో విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ నే విచారణ అధికారం నియమించడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి గత నెలలో మూడవ కళ్ళు సొసైటీకి చెందిన ఓ కళ్ళు దుకాణంలో లిక్కర్ అమ్మకం కేసులో నాన్చుడు ధోరణి వ్యవహరించినందుకు మెమోని అందుకోవడం జరిగింది తిరిగి వారం రోజుల తర్వాత మూడవ కళ్ళు డిపోకు చెందిన రెండు దుకాణాల్లో మరియు కళ్ళు డిపో నుండి కల్లు షాంపిల్స్ ని ఎటువంటి వీడియో చిత్రీకరణ లేకుండా సేకరించి తీవ్ర విమర్శల పాలు కావడం జరిగింది. సేకరించిన కళ్ళు షాంపిల్స్ ని ఇంతవరకు హైదరాబాద్ పంపకపోవడంపై ఎస్ హెచ్ ఓ ఈ డిపోలో భగస్వామిగా మారారని ఆరోపణలు వస్తున్నాయి ఒకవైపు గీతా కార్మికులకు సమానంగా రావాల్సిన వాటాదనం లాభాలు కార్మికుల సంక్షేమం అన్నీ మరచి కేవలం కుటుంబం మాత్రమే బావు పడుతుందని గౌడ సంఘం నాయకులు ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో కూరుక పోయి ఉన్నారు, గీతా కార్మికులకు పంచాల్సిన లాభాలను నెలవారిగా ఎక్సై కిందిస్థాయి అధికారులు నుండి పై స్థాయి అధికారుల వరకు క్రమం తప్పకుండా గా అందజేయడం తో ఈ డిపో పై వస్తున్న అనేక ఆరోపణలపై అధికారులే అండగా నిలబడుతున్నారని తెలియవస్తుంది

ఆడియో టేపుల కలకలం

మూడవ కళ్ళు సొసైటీ లో గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన ప్రస్తుతం జరుగుతున్న అక్రమాల పైన ఆధారాలతో సహా కొందరు గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు దృవీకరణ పత్రాలు స్థానికేతరులు అనే ఆధారాలు చూపిస్తున్న క్రమంలోనే భవాని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ వేరే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఎక్సైజ్ సీఐతో మాట్లాడాను ఎక్సైజ్ సీఐ గారిని సగబెట్టాల్సిందే ఆయనే మనకు అన్ని చక్కదిద్దుతారు అని ఆడియో టేపుని విలేకరుల సమావేశంలో వినిపించడం పై కళకళ రేగింది ఇంత జరుగుతున్నా నిజామాబాద్ ఎస్ హెచ్ ఓ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు

విచారణను గాలికి వదిలేసిన ఎక్సైజ్ ఏస్ హెచ్ ఓ

వారం రోజుల లోపు సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను అందజేసి ఒక కాపీని ఫిర్యాదుదారుడు అందజేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశించినప్పటికీ దాదాపు 15 రోజులు గడుస్తున్న ఇంతవరకు విచారణ ముందుకు జరగడం లేదు పై పెచ్చు ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ఫిర్యాదుదారుడే ఆధారాలు తీసుకొచ్చి అందజేయాలి అని ఉత్తరం రాయడం వెనుక ఆంతర్యం ఏమిటో అనే విమర్శలు వస్తున్నాయి మూడవ కళ్ళు సొసైటీ విషయంలో అండగా నిలిస్తూ కాపాడుతూ వస్తున్న నిజామాబాద్ పై స్థాయి అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారని సభ్య సమాజం ఎదురుచూస్తుంది

Leave A Reply

Your email address will not be published.