Take a fresh look at your lifestyle.

విజయ డైరీ రైతుల పాల బిల్లులు చెల్లించండి…

0 1,232

విజయ డైరీ రైతుల పాల బిల్లులు చెల్లించండి

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని నరసన్నపల్లి డైరీ పరిధిలో 7000 మంది రైతులకు విజయ డైరీ కి పాలు సరఫరా చేస్తున్నారని, గత నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని బారాస నాయకులు ఉమ్మడి మాజీ సదాశివ నగర్ జడ్పిటిసి పడిగేల రాజేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఒక కోటి 50 లక్షల రూపాయల బిల్లులు రైతులకు చెల్లించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా బిల్లుల చెల్లింపు ఆలస్యం చేసి ప్రయివేటు డైరీలకు కొమ్ముకాస్తుందన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా రైతులు ఆర్థికంగా ఎదుగుదల కోసం బర్రెలు, ఆవులను పెంపకం చేస్తూ కుటుంబ ఖర్చులను సంపాదించుకుంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు వస్తే బర్రెలకు, ఆవులకు దాణా ఇతర సంబంధించిన వస్తువులు తెచ్చుకొని మరిన్ని పాలు ఇచ్చే విధంగా ఉంటుందని, రైతులకు డబ్బులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో విజయ డైరీలో 15 రోజులకు ఒకసారి బిల్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలలు గడిచిన బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వహించే విజయ డైరీ కాపాడుకోవడానికి అయినా, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, వెంటనే రైతుల బిల్లులు విడుదల చేయాలని, లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఉమ్మడి సదాశివ నగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్ గుప్తా, జిల్లా బీసీ నాయకుడు కలాలి సాయాగౌడ్, మద్దికుంట మాజీ ఎంపీటీసీ రాజేందర్, మండల యూత్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు పోతుల లింగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, మండల నాయకులు మల్లేష్, లింబాద్రి నాయక్, రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.