ప్రమాద సూచికలు ఎక్కడ…! ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 03 (లోకంతీరు): హర్యానా నుండి జహీరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీ, కామారెడ్డి పట్టణ శివారులో ఉన్న జాతీయ రహదారి 44 పై గల నేషనల్ ఫ్యామిలీ ధాబా వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా, ఎలాంటి సూచికలు లేకుండా ఆపిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీని ఢీకొట్టగా, కంటైనర్ లారీ నడుపుతున్న డ్రైవర్ అయిన షారుక్ ఖాన్, వయసు 22 సం.లు, నివాసము భారత్ పూర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రంకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇట్టి విషయంపై చనిపోయిన వ్యక్తి బంధువు అయిన అక్బర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నిర్లక్ష్యంగా, రోడ్డుమీద ఎలాంటి సూచికలు లేకుండా ఆపిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ రాజపండి, నివాసము తిరునగర్, మధురై జిల్లా వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి ఎస్ ఎచ్ ఓ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. మృతుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, లారీ డ్రైవర్ ను కస్టడీ లోకి తీసుకున్నట్లు తెలిపారు.
