ఎల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు
కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా మార్చడంపై హర్షం
![]()
ఎల్లారెడ్డి , సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చాకలి ఐల్లమ్మ 129వ జన్మదిన వేడుకలలో ఘనంగా జరుపుకున్నారు.చాకలి ఐల్లమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఎల్లారెడ్డి రజక సంఘ సభ్యులు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ రజకసంఘ గౌరవ అధ్యక్షులు పర్వయ్య మాట్లాడుతూ … భూమి కోసం , భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం , కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి దొరల గుండెల్లో అగ్నిగోళంల రగిలిన నిప్పుకనిక చాకలి ఐల్లమ్మ అన్నారు. పేదరికంలో పుట్టిన చాకలి ఐలమ్మ వ్యవసాయం చేద్దామని పొలం కౌలుకు తీసుకున్న విషయం తెలుసుకున్న దొర తన ఇంట్లో పని చేయడానికి రాకపోగ వ్యవసాయం చేస్తుందా .. ! అని దేశముఖ్ రామచంద్రారెడ్డి ఐల్లమ్మ పండించిన పంటకు కొల్లగొట్టటానికి ప్రయత్నించాడన్నారు. దొర పంపిన మనుషులను తరిమికొట్టి తాను పండించిన పంటను కాపాడుకున్న తొలి మహిళా అని ఈ తిరుగుబాటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాందిగా మారిందని అన్నారు. ఈ తిరుగుబాటు ఎందరో మహిళలకు ఐల్లమ్మ పోరాట స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపేడేలా చేసిందని బాంచెన్ కాల్మొక్త అన్న బలహీనుల చేత బంధూకులూ పట్టించిన చాకలి ఐల్లమ్మ తెలంగాణ ఉద్యమంలో మహిళలకు స్ఫూర్తి ప్రదాయనిగా మారిందని పర్వయ్య అన్నారు. చాకలి ఐల్లమ్మ జయంతి వర్ధంతులు అధికారికంగా జరిపించాలని ప్రభుత్వం ప్రకటించడం , కోఠి మహిళ విశ్వవిద్యాలయానికి చాకలి ఐల్లమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా మార్చడంపై రజకులకు ప్రభుత్వం పట్ల గర్వాంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షులు సత్యనారాయణ, దాకాయి శేఖర్, ప్రధాన కార్యదర్శి సంఘమేశ్వర్, మహిళ కార్యదర్శి స్వరూప, నాగమణి, పద్మ, లక్ష్మణ్ , గోల్కొండ సిద్దిరాములు , నాగరాజు, శివ, కళ్యాణ్, నర్సింలు, దేవయ్య, రవి, ప్రవీణ్, బుచ్చి పర్వయ్యలు పాల్గొన్నారు.
